Akshay Kumar: మోదీకి బాలీవుడ్ హీరో ధన్యవాదాలు 10 d ago

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ప్రధాని మోదీ శంకర్ నాయర్ గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. అక్షయ్ నటించిన ‘కేసరి చాప్టర్ 2’లో శంకర్ నాయర్ పాత్రలో కనిపించనున్నాడు. జలియన్ వాలాబాగ్ ఊచకోత అనంతరం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన న్యాయవాది శంకర్ గురించి మోదీ హరియాణాలో ప్రస్తావించారు. అక్షయ్, ఈ సినిమా యువతరంకి చరిత్రను గుర్తు చేస్తుందని తెలిపారు. ఏప్రిల్ 18న విడుదల కానున్న ఈ చిత్రం బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణలకు ప్రేరేపిస్తుందన్నారు.